అక్షర పల్లవి, దుబ్బాక జనవరి 31: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువు తో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ఏఎంసీ చైర్మన్ కొంగర రవి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ లోని మహాత్మ
జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల మైదానంలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు ఎంపీడీవో భాస్కర శర్మ, ఎంఈఓ ప్రభుదాస్, ఎస్సై కీర్తిరాజు లతో కలిసి ఏఎంసి చైర్మన్ కొంగర రవి శనివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలేముల శ్రీలత రామచంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం దుబ్బాక మండల అధ్యక్షుడు పర్స దేవరాజ్ ముదిరాజ్, ఎంపీఓ నరేందర్ రెడ్డి, జ్యోతిబాపూలే ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి,పలు గ్రామాల సర్పంచులు నర్సింలు,

శ్రీనివాస్,కొండ విటోభ,రాంజ్య నాయక్, సత్యనారాయణ,గ్రామ ఉపసర్పంచ్ బోల్గం ప్రవీణ్ గౌడ్,సెక్రెటరీలు పాల్గొన్నారు.